మరో మేకోవర్‌

24 Aug, 2020 02:13 IST|Sakshi

‘బాహుబలి’ కోసం యోధుడిగా తన శరీరాన్ని మార్చుకున్నారు ప్రభాస్‌. అలానే కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. తాజాగా మరోసారి కొత్త విద్య, బాడీ మేకోవర్‌ మీద ప్రభాస్‌ దృష్టి పెడుతున్నారు. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆది పురుష్‌’ అనే చిత్రంలో నటించనున్నారు ప్రభాస్‌. ఇందులో రాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం విలు విద్య నేర్చుకోనున్నారు ప్రభాస్‌. అలాగే విలు విద్య చేసేవారి శరీరాకృతిని పోలినట్లుగా తన ఫిజిక్‌ని మార్చుకోనున్నారు.

ఈ విషయాన్ని దర్శకుడు ఓం తెలిపారు. ‘‘నా కథలో రాముడిగా ప్రభాస్‌ని తప్ప ఎవ్వర్నీ ఊహించుకోలేకపోయా. ఈ పాత్రను అతను తప్ప ఎవ్వరూ చేయలేరనిపించింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ స్టార్‌ ప్రభాస్‌. మౌనంగా మునిలా ఉంటూనే, రౌద్రంగా గర్జించగలిగే విభిన్నమైన కాంబినేషన్‌ ప్రభాస్‌. ఈ సినిమాలో ఆయన శరీరాకృతిని కొత్తగా చూపించబోతున్నాం. దానికి సంబంధించి నిపుణులతో సంప్రదిస్తున్నాం. అలాగే విలు విద్య కూడా నేర్చుకోబోతున్నారు ప్రభాస్‌’’ అని తెలిపారు ఓం రౌత్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు