ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌

19 Jan, 2021 10:05 IST|Sakshi

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న సినిమా ‘ఆదిపురుష్’. ఇందులో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు తాజాగా షురూ చేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ మంగళవారం సోషల్‌ మీడియా వెదికగా వెల్లడించారు. మోషన్ క్యాప్చర్ బృందంతో కలిసి డైరెక్టర్ ఓం రౌత్ తీసుకున్న ఫొటోను కూడా ప్రభాస్ షేర్ చేశారు. ‘మోషన్ క్యాప్చర్ స్టార్టయ్యింది. ‘ఆదిపురుష్’ ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు’అని ప్రభాస్ పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌తో షూటింగ్ చేయనుంది. ఈ చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభంకానుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ మాత్రమే ఖరారయ్యారు. మిగిలిన పాత్రలు ఎవరు పోషిస్తారు, సాంకేతిక నిపుణులు ఎవరు వంటి విషయాలు తెలియాల్సి ఉంది. అయితే సీతగా కృతీసనన్‌ నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే యంగ్‌ హీరో సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 300 కోట్లతో ఆదిపురుష్‌ తెరకక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది.

A post shared by Prabhas (@actorprabhas)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు