ప్రభాస్‌కు పెదనాన్నంటే ఎంత ప్రేమో!

20 Jan, 2021 19:34 IST|Sakshi

కొడుకు ఎంత ఎదిగితే తండ్రికి అంత గర్వకారణం. కానీ పిల్లలు ఆకాశమంత ఎత్తు ఎదిగినా తండ్రికి మాత్రం ఎప్పటికీ కంటి పాపలా కాచుకునే చంటిపిల్లలే. నేడు(బుధవారం) సీనియర్‌ నటుడు కృష్ణం రాజు 81వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ప్రభాస్‌ అభిమానులతో పాటు, పలువురు సెలబ్రిటీలు ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆయన బర్త్‌డే పార్టీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కృష్ణం రాజు తమ్ముడి కొడుకు, పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌ ఆయనకు జుట్టు సరి చేస్తున్నాడు. అతడు చూపిస్తున్న ప్రేమకు తడిసి ముద్దయిన ఆయన ప్రభాస్‌ను కొద్ది క్షణాల పాటు అలాగే చూస్తుండిపోయాడు. ప్రభాస్‌ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఈ వీడియోకు కామెంట్లు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రభాస్‌కు పెదనాన్నంటే ఎంత ప్రేమో అంటున్నారు. (చదవండి: నా సినిమా ఎవరు చూస్తారనుకున్నా: విజయ్‌)

గతేడాది కృష్ణం రాజు బర్త్‌డే పార్టీలో డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు, మెగాస్టార్‌ చిరంజీవి సహా పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. ఆ వేడుకల్లో కృష్ణం రాజు తన సొంత కొడుకులా చూసుకునే ప్రభాస్‌కు కేక్‌ తినిపిస్తున్న ఫొటోతో పాటు, కుటుంబంతో కలిసి దిగిన పలు ఫొటోలు సైతం నెట్టింట తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఈ వీళ్లిద్దరూ 'బిల్లా', 'రెబెల్'‌ సినిమాలలో కలిసి నటించారు. ప్రభాస్‌ ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్‌లో 'రాధేశ్యామ్'‌ సినిమా చేస్తున్నారు. ఈ మధ్యే ఓ పార్ట్‌ ముంబైలో చిత్రీకరణ జరుపుకున్నారు. అలాగే 'ఆదిపురుష్‌'లోనూ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓమ్‌రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపిక పదుకోన్‌, అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీటితోపాటు సలార్‌, నాగ్‌ అశ్విన్‌తో మరో సినిమా చేయనున్నారు. (చదవండి: తమిళనాడు గవర్నర్‌గా కృష్ణంరాజు?)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు