ఎట్టకేలకు సెట్స్ పైకి ప్రభాస్ కొత్త సినిమా

24 Jul, 2021 13:52 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. గురు పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఈ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభమైంది. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి  ‘ప్రాజెక్ట్‌ కే’ అనే వర్కింగ్‌ టైటిల్‌ ఫిక్స్ చేశారు.

ఈ సినిమా పూజా కార్యక్రమంలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాల్గోన్నాడు. ముహూర్తపు షాట్‌కి ప్రభాస్‌ క్లాప్‌ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేదు. ‘గురు పౌర్ణమి సందర్భంగా ఇండియన్‌ సినిమాల గురువుని స్టార్ట్‌ చేశాం’అని వైజయంతతీ మూవీస్‌ ట్వీట్‌ చేసింది. 

ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించనున్నారు. మొత్తానికి ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మూవీ సెట్స్ పైకి రావడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. నిజానికి ఈ సినిమా ముందే మొద‌ల‌వ్వాల్సి ఉన్నా ప్ర‌భాస్ స‌లార్, ఆదిపురుష్ మూవీతో బిజీగా మార‌టంతో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు