Salaar Movie Update: ప్రభాస్‌ 'సలార్‌'పై క్రేజీ అప్‌డేట్‌.. పోస్టర్‌ విడుదల

15 Aug, 2022 13:57 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కేజీఎఫ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ కలయికలో వస్తున్న చిత్రం 'సలార్‌'.ఈ సినిమా అప్‌డేట్‌ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు ఇండిపెండెన్స్‌డే రోజున చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. సలార్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. కాగా శ్రుతీ హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా,  జగపతిబాబు కీలక పాత్రను పోషిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

మరిన్ని వార్తలు