‘రాధేశ్యామ్‌’ విషాదమా.. అమర ప్రేమ కావ్యమా?

23 Oct, 2020 12:59 IST|Sakshi

డార్లింగ్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తోన్న 'బీట్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌'ని మోషన్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. విజువల్‌ వండర్‌గా వచ్చిన ఈ పోస్టర్‌ అభిమానులను ఎంతో అలరిస్తుంది. 1.16 నిమిషాల నిడివి ఉన్న ఈ పోస్టర్‌లో ముందుగా అర చేయి కనిపిస్తుంది. దాంట్లో అడవి.. అందులో రైలు. ఒపెన్‌ చేస్తే ఫస్ట్‌ రోమియో-జులియేట్‌, తర్వాత సలీం-అనార్కలీ, తర్వాత దేవదాసు-పార్వతీల బొమ్మలు కనిపిస్తాయి. ఆ తర్వాత పూజా హెగ్డే రైలు బోగి డోర్‌ వద్ద నిల్చుని బయటకు చూస్తుంది. తర్వాత డార్లింగ్‌ ఆమెను చూస్తూ నిల్చుంటాడు. ఇదంతా చూస్తుంటే ఓ ట్రైన్‌లో వీరిద్దరి మధ్య జరిగే ప్రేమ కథగా రాధేశ్యామ్‌ తెరకెక్కినట్లు తెలుస్తోంది. అలానే ముందు వచ్చిన అమర ప్రేమికుల బొమ్మలను చూస్తే.. ఈ చిత్రం కూడా గొప్ప అమర ప్రేమ కావ్యంగా ఉంటుందా లేక ఆ కథల్లనే రాధేశ్యామ్‌ కూడా విషాదంగా ముగుస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కానీ ఈ మోషన్‌ పోస్టర్‌ మాత్రం సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. (చదవండి: ‘రాధేశ్యామ్’ సర్‌ప్రైజ్‌.. ప్రభాస్‌ లుక్‌ అదుర్స్‌)

ఇక ఈ మూవీలో విక్రమాదిత్యగా ప్రభాస్ కనిపించనుండగా.. పూజా ప్రేరణగా నటిస్తున్నారు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి జస్టిన్ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోన్న రాధే శ్యామ్‌ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు