Prabhas Birthday Special: మిర్చిలాంటి కుర్రాడు..మన 'బాహుబలి'

23 Oct, 2021 15:32 IST|Sakshi

ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్‌

Happy Birthday Prabhas: ప్రభాస్‌.. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదు..ఇదొక బ్రాండ్‌ అంటారు డార్లింగ్‌ ఫ్యాన్స్‌. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రభాస్‌కు అభిమానులు ఉన్నారు. బాహుబలి సినిమా అనంతరం ప్రభాస్‌కు విదేశాల్లోనూ విపరీతమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. శనివారం(అక్టోబర్‌23)న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ఆయన వరల్డ్‌ వైడ్‌ క్రేజీ ఫ్యాన్స్‌పై ఓ లుక్కేద్దాం. 

ప్రభాస్‌ వీరాభిమాని ఒకరు ఇటీవలె తన హోటల్‌ను ప్రారంభించారు. రాధే శ్యామ్‌ పోస్టర్‌ను హోటల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌గా మార్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇక రాధేశ్యామ్‌ సినిమా అనౌన్స్‌ చేసినప్పటి నుంచి ఈ సినిమా రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 

బాహుబలి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీ వచ్చిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాహుబలి, భల్లాలదేవ, కట్టప్ప, శివగామి పాత్రలు ఈ సినిమాలో కీ రోల్‌ పోషించాయి. ఈ మూవీకి ఉన్న క్రేజ్‌ను తమ హోటట్‌ ప్రమోషన్స్‌కి వాడుకుంటున్నాయి. ఇందులో భాగంగానే బాహుబలి థాలీ, దేవసేన పరాఠా, కట్టప బిర్యానీ, భల్లదేవ పాటియాలా లస్సీ, శివగామి షాహి పక్వాన్ వంటి స్పెషల్‌ వంటకాలను తమ మెనూలో చేర్చారు. ఇప్పటికీ బాహుబలి థాలీకి మంచి డిమాండ్‌ ఉంది. 


ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు ఓ ఫ్యాన్‌ ఏకంగా తన వీపుపై బాహుబలి టాటూను వేయించుకున్నారు. ఈ టాటూ ఫోటో అప్పట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. 


ఆరడుగుల అందగాడు ప్రభాస్‌కు అమ్మాయిల ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే. రష్యన్‌కు చెందిన ఓ లేడీ ఫ్యాన్‌ లవ్‌ ప్రభాస్‌ అంటూ తన వీపుపై టాటూ వేయించుకుంది. మరికొందరు అమ్మాయిలేమో ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అంటూ ఇప్పటికీ రిక్వెస్టులు పెడుతూనే ఉంటారు.  మరి ఈ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి.

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలికి పెద్ద వాళ్ల నుంచి చిన్నపిల్లల దాకా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అందుకే కొన్ని టాయ్స్‌ కంపెనీలు బాహుబలి బొమ్మలను రూపొందించి బాగా లాభాపడ్డాయి. 

ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా జపాన్‌లో డార్లింగ్‌కు క్రేజీ గర్ల్‌ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఓసారి జపాన్‌ లేడీ ఫ్యాన్స్‌ అంతా కేవలం ప్రభాస్‌ను కలవడానికే ఇండియాకు వచ్చారు. స్వయంగా ఆయన ఇంటి ముందు కూడా కొన్ని ఫోటోలను దిగి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

ప్రభాస్‌ మిర్చిలాంటి కుర్రాడు. సరిగ్గా ఇదే పాయింట్‌ను తమ బిజినెస్‌ ప్రమోషన్‌కు వాడేసింది జపాన్‌లోని ఓ హోటల్‌. అక్కడ దొరికే ఓ స్పైసీ డిష్‌ ప్యాకేజింగ్‌లో ప్రభాస్‌ ఫోటోను అతికించి తమ బిజినెస్‌కు ప్రమోట్‌ చేసుకున్నారు. జపాన్‌లో ప్రభాస్‌కు క్రేజీ ఫ్యాన్స్‌ ఉండటంతో దీనికోసం అక్కడి ప్రజలు ఎగబడ్డారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రాధేశ్యామ్‌, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో సలార్‌ అనే పాన్‌ ఇండియా చిత్రాల్లో నటిస్తున్నారు. తన 25వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్నట్లు ఇటీవలె ప్రభాస్‌ ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘స్పిరిట్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలు కంప్లీటైన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. 

మరిన్ని వార్తలు