Dunki vs Salaar: షారుఖ్‌తో ప్రభాస్‌ ఢీ..  క్రిస్మస్‌ బరిలో సలార్‌, డుంకీ!

26 Sep, 2023 15:02 IST|Sakshi

ప్రశాంత్‌ నీల్‌-ప్రభాస్‌ కాంబోలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ డిసెంబర్‌లో రిలీజ్‌ కాబోతుందనే చర్చ నెట్టింట వైరల్‌గా మారింది. సెప్టెంబర్‌ 28న విడుదల కావాల్సిన ఈ సినిమా హఠాత్తుగా వాయిదా పడింది. కొత్త డేట్‌ని ప్రకటించలేదు. వచ్చే ఏడాది వేసవి బరిలోకి దిగబోతున్నాడని తొలుత వార్తలు వినిపించాయి. కానీ తాజాగా ఈ ఏడాది డిసెంబర్‌లోనే సలార్‌ రాబోతుందనే చర్చ నెట్టింట బాగా జరుగుతోంది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 22న సలార్‌ విడుదల కాబోతుందని ఓ సినీ విశ్లేషకుడు పోస్ట్‌ పెట్టడమే ఈ చర్చకు కారణం.  

ఇక ఇదే తేదిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘డుంకీ’కూడా విడుదల కాబోతుంది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ మొదటిసారి షారుఖ్ తో తీస్తున్న సినిమా ఇది. షూటింగ్‌ మొదలైన రోజు విడుదల తేదిని ప్రకటించారు. 

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ Vs షారుఖ్‌ ఫ్యాన్స్‌
ఇద్దరు బడా హీరోల సినిమాలు ఒకేసారి విడుదల అయితే ఫ్యాన్స్‌ మధ్య గొడవలు జరగడం సహజం. ఆ ఎఫెక్ట్‌ వసూళ్లపై కూడా పడుతుంది. అందుకే బరిలో ఒక్క పెద్ద సినిమా ఉంటే మిగతా సినిమాలన్ని విడుదలను పోస్ట్‌పోన్‌ చేసుకుంటాయి. లేదంటే ముందు, వెనక విడుదల చేస్తాయి. సలార్‌ సెప్టెంబర్‌ 28న విడుదలవుతుందని ప్రకటించడంతో స్కంద, చంద్రముఖి 2 లాంటి బడా సినిమాలు సెప్టెంబర్‌ 15నే రావడానికి సిద్ధమయ్యాయి. కానీ సలార్‌ విడుదల వాయిదా పడగానే.. ఆ డేట్‌లోకి మార్చుకున్నాయి.   

ఇక ఇప్పుడు డిసెంబర్‌ 22న విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే రోజు షారుఖ్‌ డుంకీ కూడా రీలీజ్‌ కానుంది.  ఒకవేళ డుంకీ వాయిదా పడితే సలార్‌కి భయపడి వాయిదా వేశారనే  కామెంట్స్‌ వస్తాయి. లేదని సలార్‌తో తలపడితే బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌పై దెబ్బ పడుతుంది. నార్త్‌లో షారుఖ్‌ హవా కొనసాగితే.. సౌత్‌లో ప్రభాస్‌ హవా ఉంటుంది.  

పరస్పరం మాట్లాడుకొని ఒకరు తమ సినిమాను వాయిదా వేసుకుంటే బాగుంటుందని బయ్యర్లు కోరుకుంటున్నారు. మరోవైపు మాకు పోటీగా వస్తే నష్టపోతారని  ప్రభాస్‌- షారుఖ్‌ ఫ్యాన్స్‌ పరస్పరం కవ్వించుకుంటున్నారు.  ఒకవేళ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే మాత్రం ఆ ఎఫెక్ట్‌ కచ్చితంగా బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌పై పడుతుంది. 

మరిన్ని వార్తలు