Pushpa Pre Release: ఇక్కడ ప్రభాస్‌..అక్కడ సల్మాన్‌.. బన్నీకి సపోర్ట్‌గా ఆ ఇద్దరు!

3 Dec, 2021 14:02 IST|Sakshi

తన సినిమాను ప్రమోట్ చేయడంలో అల్లు అర్జున్‌ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పటికే పుష్ప పాటలకు పాన్‌ ఇండియా స్థాయిలో ఇంప్రెస్ చేసేలా చేశాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తన బెస్ట్ ఫ్రెండ్ ను ఆహ్వానిస్తున్నాడట. విచిత్రం ఏంటంటే అతను ప్యాన్ ఇండియా స్టార్.

సినీ పరిశ్రమలో ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత మళ్లీ కలసి కనిపించబోతున్నారట. ఆ ఇద్దరు ఎవరో కాదు పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ తన బెస్ట్ ఫ్రెండ్ ప్రభాస్ ను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించాలి అనుకుంటున్నాడట అల్లు అర్జున్.

ఒకప్పుడు ప్రభాస్ కొత్త సినిమా ఆడియో రిలీజ్ కు బన్ని, అలాగే అల్లు అర్జున్ ఆడియో రిలీజ్ కు ప్రభాస్ ముఖ్య అతిథులుగా వెళ్లేవారు. కాని కొన్నేళ్లుగా ఫ్రెండ్స్ ఇద్దరు ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉండటంతో కలసి కనిపించలేదు. ఇప్పుడు పుష్ప ను ప్రమోట్ చేసేందుకు పాన్ ఇండియా ఆడియెన్స్ కు ఈ మూవీని చేరువచేసేందుకు స్వయంగా ప్రభాస్ రంగంలోకి దిగుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని తన ప్రమోషన్స్ లో యాడ్ చేస్తున్నారు బన్నీ. హిందీ బిగ్‌ బాస్‌ సీజన్‌ 15 లో అల్లు అర్జున్‌ అడుగు పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. సల్మాన్‌ హోస్ట్‌గా వ్వవహరిస్తున్న ఈ షోకి వెళ్లడం వలన పుష్ప సినిమాకు ఓ రేంజ్‌లో మైలేజ్‌ వస్తుందంటున్నారు సినీ ప్రముఖులు. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప మూవీ డిసెంబర్ 17న రిలీజ్ అవుతోంది. 

మరిన్ని వార్తలు