Prabhas Fan: రాదేశ్యామ్‌ సినిమా ఫ్లాప్‌ అయ్యిందని అభిమాని ఆత్మహత్య

13 Mar, 2022 10:39 IST|Sakshi

కర్నూలు (టౌన్‌): ఇటీవల విడుదలయిన హీరో ప్రభాస్‌ సినిమా రాధేశ్యామ్‌ ఫ్లాప్‌ అయ్యిందని కర్నూలులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలలోకి వెళితే.. కర్నూలు తిలక్‌నగర్‌లో నివసించే ముత్యాల రవితేజ (24) వృత్తిరీత్యా వెల్డింగ్‌ పని చేస్తుంటాడు. తల్లి ఉషారాణి రోజు వారీ కూలీ పనులు చేస్తుంది. తండ్రి లేడు. మృతుడు హీరో ప్రభాస్‌ వీరాభిమాని. శుక్రవారం ప్రభాస్‌ నటించిన రాదేశ్యామ్‌ సినిమా చూశాడు.

మిత్రులతో కలిసి సినిమా ఫ్లాప్‌ అయ్యిందని బాధపడ్డాడు. ఇంట్లో తల్లితో కూడా ఇదే చెప్పాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణం చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

మరిన్ని వార్తలు