తీవ్ర నిరాశలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. కారణం ఇదే!

21 Apr, 2021 20:17 IST|Sakshi

‘ఈ రోజు శ్రీరామ నవమి. అంటే రాముడి పండగ. ఇంకేముంది శ్రీరాముడిగా నటిస్తున్న తమ అభిమాన హీరో కొత్త సినిమా ‘ఆదిపురుష్‌’ నుంచి పక్కా అప్‌డేట్‌ వస్తుందని ఆశ పడ్డారు డార్లింగ్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌. బుధవారం ఉదయం 7:11 గంటలకు ఆదిపురుష్‌ నుంచి కొత్త అప్ డేట్ బయటికి వస్తుందని వదంతులు రావడంతో ఆ ఆశ మరింత పెరిగింది. ఈ రోజు ఉదయం నుంచే ఆదిపురుష్‌ సర్‌ప్రైజ్‌‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు.

కానీ వారి ఆశలన్ని అడియాశలుగానే మిగిలాయి. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిపురుష్‌ నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు లోనయ్యారు. రామాయణం నేపథ్యంలో వస్తున్న సినిమా నుంచి శ్రీరామ నవమి రోజు అప్‌డేట్‌ ఇవ్వకపోవడం బాధాకరమని అంటున్నారు. తమ నిరాశను సోషల్ మీడియా వేదికలపై వ్యక్తం చేస్తున్నారు.

రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.

చదవండి:
ఐసోలేషన్‌లోకి ప్రభాస్‌.. రాధేశ్యామ్‌ షూటింగ్‌కు బ్రేక్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు