Prabhas Project K First Look Trolls: ప్రభాస్‌కే ఎందుకిలా? అసలేం జరుగుతోంది?

19 Jul, 2023 18:53 IST|Sakshi

Prabhas Project K First Look Trolls: డార్లింగ్ ప్రభాస్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో. దీంతో ప్రస్తుతం అలాంటి భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కొత్త చిత్రాల అప్డేట్స్ అంటే ఎలా ఉండాలి. చూసే ప్రతిఒక్కరి మైండ్ బ్లాంక్ అయిపోవాలి. కట్ చూస్తే.. నిజంగానే అందరి బుర్ర తిరిగిపోతోంది. అయితే అది రివర్స్‌లో. ఇలా చెప్పడానికి 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్‌తోపాటు చాలానే కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం.

టాలీవుడ్‌ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. దానికి కారణం ప్రభాస్, రాజమౌళి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 'బాహుబలి' సినిమాతో నటుడిగా ప్రభాస్, డైరెక్టర్‌గా రాజమౌళి బోలెడంత క్రేజ్ అందుకున్నారు. రాజమౌళి ఆస్కార్ రేంజుని అందుకున్నాడు. ప్రభాస్‌ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. కరెక్ట్ గా చెప్పాలంటే డైరెక్టర్స్ అతడితో ఆడేసుకుంటున్నారా అనే డౌట్ వస్తోంది.

(ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!)

ఎందుకంటే 'బాహుబలి' తర్వాత 'సాహో' చేశాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఆ సినిమా పర్వాలేదనిపించింది. కాకపోతే ప్రభాస్ రేంజ్‌కి తగ్గ మూవీ కాదని అప్పట్లో అభిమానులు మాట్లాడుకున్నారు. కాస్త కేర్ తీసుకుని ఉండాల్సిందని అన్నారు. దీని తర్వాత 'రాధేశ్యామ్' వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఓకే అనిపించినా.. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వచ్చాయి గానీ ప్రేక్షకుల్ని ఎందుకో అలరించలేకపోయింది.

ఈ మధ్య వచ్చిన 'ఆదిపురుష్' గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఈ మూవీకి అయితే ఫస్ట్ లుక్ నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత కూడా ఘోరమైన ట్రోలింగ్ జరిగింది. 'సలార్' టీజర్‌తో అభిమానుల కాస్త తేరుకున్నప్పటికీ... ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్ వాళ్లని మరోసారి డిసప‍్పాయింట్ అయ్యేలా చేసింది. ఐరన్ మ‍్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే 'మహానటి' లాంటి టిపికల్ స్క్రిప్ట్‌ని తీసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడం, ఒక్క లుక్‌తో మూవీ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది సినిమా లవర్స్ వాదన.

ఇంకా 'ప్రాజెక్ట్ K' టైటిల్ కూడా రివీల్ చెయ్యలేదు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్‌లో టైటిల్ ఏంటనేది బయట పెట్టబోతున్నారు. అలాగే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వస్తుంది. అవి ఈ సినిమా గురించి పూర్తి డీటైలింగ్ ఇస్తాయి. ఏది ఏమైనా ఈ మధ్య ప్రభాస్ ప్రతి సినిమా ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ లుక్ లాంటివి ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తుండటం కాస్త వింతగా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: Project K: దీపికా పదుకోన్‌ ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది)

మరిన్ని వార్తలు