కొత్త లగ్జరీ కారులో షికారుకెళ్లిన ప్రభాస్‌

29 Mar, 2021 14:39 IST|Sakshi

బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్‌ హీరో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం ఎదిగిపోయింది. 'సాహో' సినిమాతో ఆయన హిందీ మార్కెట్‌ పరిధి విస్తరించింది. తెలుగులో ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ హిందీలో మాత్రం కాసులు కురిపించింది. సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు పాన్‌ ఇండియా రూటును ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఆదిపురుష్‌, రాధేశ్యామ్‌, సలార్‌తో పాటు నాగ్‌ అశ్విన్‌తో మరో సినిమా చేస్తున్నాడు.

ఇవన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలే కావడం విశేషం. ముఖ్యంగా వీటి హెవీ షూటింగ్‌ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌ ముంబైలో ఓ ఇల్లు కొనుక్కునే వేటలో పడ్డాడని ఆ మధ్య వార్తలు వినిపించాయి. అయితే అదెంతవరకు వచ్చిందనేది ఇంకా తెలియరాలేదు. కానీ, తాజాగా ఈ హీరో ఓ ఖరీదైన కారును సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేసినట్లు సోషల్‌ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.

నేడే(ఆదివారం) ఈ కారు హైదరాబాద్‌ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇద దీని ధర సుమారు ఏడు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రభాస్‌కు ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కార్లు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ జాబితాలో లంబోర్గిని కారు వచ్చి చేరింది. కొత్త కారు కొన్న ప్రభాస్‌కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చదవండి: ఆదిపురుష్: తగ్గేది లేదంటున్న బాలీవుడ్‌ భామ

షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్‌ వెతుకుతున్న డైరెక్టర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు