పాన్‌ ఇండియా చిత్రాలతో బిజీబిజీ.. మళ్లీ మారుతికి ఓకే.. ప్రభాస్‌ ప్లాన్‌ ఏంటి?

19 Apr, 2022 11:47 IST|Sakshi

పాన్ ఇండియా ట్రెండ్ లోకి ఎంత మంది హీరోలు వచ్చినప్పటికీ,ప్రభాస్ స్టార్ డమ్ కు మాత్రం తిరుగులేదు.ఆ విధంగా తాను ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యాడు. వచ్చే ఏడాదిలో ఆదిపురుష్, సలార్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రాలతో బాహుబలి 2 రిలీజైనప్పటి రోజులను,ఇంకా చెప్పాలంటే కేజీయఫ్ 2 రిలీజ్ హంగామాను మరోసారి రిపీట్ చేస్తానంటున్నాడు.మరో వైపు ప్రాజెక్ట్ కే , స్పిరిట్ లాంటి చిత్రాలు కూడా  చేతిలో ఉన్నాయి. అయినా డైరెక్టర్‌ మారుతి సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. అయితే దానికి ఓ కారణం ఉంది అంటున్నాడు ప్రభాస్‌.

పాన్‌ ఇండియా చిత్రాల మధ్య రాధేశ్యామ్‌ లాంటి లవ్‌స్టోరీ, మారుతితో మరో డిఫరెంట్‌ మూవీని ఎందుకు చేస్తున్నాడో క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న  ప్రాజెక్ట్స్ లో ఎక్కువ భాగం యాక్షన్ మూవీస్ ఉన్నాయని,  వీటి మధ్య తాను విభిన్నంగా కనిపించేందుకు రాధేశ్యామ్ లాంటి చిత్రాలు చేస్తున్నట్లు చెప్పాడు ప్రభాస్.  మారుతితో కూడా అలాంటి డిఫరెంట్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. పక్కా ప్లాన్‌ ప్రకారమే ప్రభాస్‌ మారుతికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్‌’ వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా రిలీజ్ డేట్ తో సహా సలార్ టీజర్ ను మేలో రిలీజ్ చేయబోతున్నారు.

మరిన్ని వార్తలు