వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌!

28 Aug, 2020 05:47 IST|Sakshi

కరోనా కారణంగా చాలామంది ఆఫీసులకు వెళ్లకుండా ఇంటి నుంచే పని చేస్తున్నారు. సినిమాలకు సంబంధించిన కొన్ని పనులు కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ జరుగుతున్నాయి. తాజాగా ప్రభాస్‌ కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ మోడ్‌లోకి వెళ్లనున్నారట. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ అనే ప్యాన్‌ ఇండియా సినిమాని అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో కనిపించనున్నారాయన.

ఈ సినిమా కోసం ప్రభాస్‌ విలు విద్య నేర్చుకోనున్నారని,   శరీరాకృతిని కూడా అందుకు తగ్గట్టుగా మార్చుకోనున్నారని దర్శకుడు తెలిపారు. దీనికి సంబంధించిన శిక్షణను త్వరలోనే ప్రారంభించనున్నారు. విలు విద్యకు సంబంధించిన సెటప్‌ను ప్రభాస్‌ తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేసుకోనున్నారని సమాచారం. ఒక ట్రైనర్‌ ఆధ్వర్యంలో ఈ శిక్షణనంతా ఇంట్లోనే పూర్తి చేస్తారట. వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తారని సమాచారం.

మరిన్ని వార్తలు