Prabhas New Business Plan: చేతిలో 5 సినిమాలు, రూ, 600 కోట్ల రెమ్యునరేషన్‌.. డబ్బంతా ఏం చేస్తున్నట్లు?

9 Jul, 2022 10:38 IST|Sakshi

ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్‌ మాత్రమే. రాధేశ్యామ్ రిలీజ్ కు ముందు వరకు ప్రభాస్ రెమ్యూనరేషన్ వంద కోట్లు.ఈ మూవీ రిలీజ్ తర్వాత సినిమా అనుకున్నంతగా ఆడపోయినా సరే మళ్లీ మరో 20 కోట్లు రెమ్యూనరేషన్ పెంచేశాడు ఈ పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.120 కోట్ల పారితోషికం డిమాండ్‌ చేస్తున్నాడు. 

(చదవండి: స్టార్‌ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు)

ప్రభాస్ సెట్ చేసుకున్న ఈ రెమ్యూనరేషన్ ఫిగర్ ఏ ప్రొడ్యూసర్ కు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రభాస్ సినిమా జస్ట్ హిట్ టాక్ వస్తేనే వెయ్యి కోట్లు ఇట్టే వస్తాయని నిర్మాతలు నమ్ముతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఐదు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ లెక్కన ఐదారు వందల కోట్ల రూపాయలు ప్రభాస్ అకౌంట్‌లోకి వెళ్తున్నాయి.

మరి ఈ డబ్బుతో ప్రభాస్ ఏం చేస్తున్నట్లు అంటే...బిజినెస్ మెన్ గా మారబోతున్నాడు అట.త్వరలోనే హోటెల్ చైన్ మార్కెట్ లోకి ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అయితే తన హోటెల్ బిజినెస్ ను ఇండియాలో కాకుండా దుబాయ్, స్పెయిన్ దేశాల్లో విస్తరించాలనుకుంటున్నాడట. ప్రస్తుతం ఈ బిజినెస్ ప్లానింగ్ లోనే ప్రభాస్ బిజీగా ఉన్నాడట.

మరిన్ని వార్తలు