కృష్ణుడిని అభినందించిన ప్రభాస్‌

7 Aug, 2020 18:55 IST|Sakshi

‘మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్‌ లుక్ పోస్టర్‌‌ని ఆవిష్కరణ

వినాయకుడు ఫేమ్‌ కృష్ణుడు తొలిసారి నిర్మిస్తున్న చిత్రం ‘మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్‌’.. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ని యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ శుక్రవారం ఆవిష్కరించారు. నిర్మాతగా మారిన కృష్ణుడికి అభినందనలు తెలిపారు. నిర్మాతగా అతను సక్సెస్‌ అవ్వాలని ప్రభాస్‌ ఆకాక్షించారు. ఇక నిత్యా క్రియేషన్స్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ సెన్సార్‌ కార్య్రమాలు పూర్తిచేసుకుంది. త్వరలోనే ఓటిటిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ.. ‘నా కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాను. ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా అందరికి నచ్చే కంప్లీట్ లవ్ అండ్‌ కామెడీ ఎంటర్ టైనర్. సినిమా ఫైనల్‌ ఔట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు. నిర్మాతగా ప్రయాణం ప్రారంభిస్తున్నాను. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’అని కృష్ణుడు పేర్కొన్నారు.  ఈ సినిమా ద్వారా లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు కృష్ణుడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా