‘ప్రాజెక్ట్‌ కె’ కోసం 200 రోజులు కేటాయించిన ప్రభాస్‌

28 Jul, 2021 10:01 IST|Sakshi

‘బాహుబలి’ (‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’) కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించారు ప్రభాస్‌. ఇప్పుడు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌)కి డబుల్‌ సెంచరీ డేట్స్‌ ఇవ్వడానికి ప్లాన్‌ చేశారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఇందులో కీలక పాత్ర చేస్తున్న అమితాబ్‌ బచ్చన్‌ పై సీన్స్‌ చిత్రీకరిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో రోబోల ప్రస్తావన ఉంటుందని, అలాగే ఓ సోషల్‌ మెసేజ్‌ కూడా ఉంటుందని టాక్‌. అందుకే షూటింగ్‌కి రెండొందలు రోజుల పైనే పడుతుందట. ఈ చిత్రంలో సమంత, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌లు కనిపిస్తారని భోగట్టా. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు