Salaar: ప్రభాస్‌ సినిమా షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడే!

29 Jun, 2021 07:36 IST|Sakshi

‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణతో కొన్ని రోజులుగా బిజీగా ఉన్నారు హీరో ప్రభాస్‌. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో పూర్తవుతుంది. అలాగే సినిమా విడుదల తేదీపై వచ్చే నెలలో స్పష్టత రానుంది. మరోవైపు ప్రభాస్‌ ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. ముంబయ్‌లో ‘ఆదిపురుష్‌’, గోదావరిఖని ప్రాంతంలో ‘సలార్‌’ సినిమాల ఫస్ట్‌ షెడ్యూల్స్‌ కూడా జరిగాయి. అయితే కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణలు ఆగిపోయాయి.

ఇప్పుడు పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘సలార్‌’ తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ ఆగస్టులో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, శ్రుతీహాసన్‌లపై కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశారు చిత్రదర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నారు. అలాగే ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఇలాంటివి ఎవరూ చేయకండి..బాధగా ఉంది : రష్మిక

మరిన్ని వార్తలు