ముంబైలో ఆదిపురుష్‌ షూటింగ్‌

18 Aug, 2021 11:14 IST|Sakshi

హైదరాబాద్‌ నుంచి హీరో ప్రభాస్‌ ముంబై వెళ్లారు. ఢిల్లీ నుంచి హీరోయిన్‌ కృతీ సనన్‌ ముంబైలో అడుగుపెట్టారు. వీరిద్దరూ కాకతాళీయంగా ముంబైలో ల్యాండ్‌ కాలేదు. ‘ఆదిపురుష్‌’ సినిమా షూటింగ్‌ కోసం ముంబై చేరుకున్నారు. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ మైథలాజికల్‌ ఫిల్మ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతీ సనన్‌ కనిపిస్తారు. రావణుడి పాత్రను సైఫ్‌ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్‌ చేస్తున్నారు.

ముంబైలో జరుగుతున్న ‘ఆదిపురుష్‌’ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణలో మంగళవారం నుంచి ప్రభాస్‌ పాల్గొంటున్నారు. కొన్నిరోజుల పాటు ప్రభాస్‌ ఈ సెట్స్‌లో ఉంటారు. ప్రభాస్‌తో పాటు కృతీసనన్‌ కూడా షూట్‌లో పాల్గొంటారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఇది  కాకుండా ‘రాధేశ్యామ్‌’, ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రాలు చేస్తున్నారు ప్రభాస్‌.

చదవండి :ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్లాలనుంది : బిగ్‌బాస్‌ బ్యూటీ
శ్రుతిహాసన్‌ కోసం ప్రభాస్‌ చేయించిన వంటలు చూస్తే నోరూరాల్సిందే..

మరిన్ని వార్తలు