హైదరాబాద్‌ శివార్లలో ‘ప్రాజెక్ట్‌ కె’ షూటింగ్‌.. పాల్గొననున్న ప్రభాస్‌, అమితాబ్‌

30 Nov, 2022 07:42 IST|Sakshi

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌ శివార్లలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది.

అయితే ప్రభాస్‌ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. డిసెంబరు 2 నుంచి ప్రభాస్‌ ఈ సినిమా షూటింగ్‌తో బిజీ అవుతారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో అమితాబ్‌ బచ్చన్‌ కూడా పాల్గొంటారట. ప్రభాస్, అమితాబ్‌ కాంబినేషన్‌ సీన్స్‌ను ప్లాన్‌ చేశారట నాగ్‌ అశ్విన్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024లో రిలీజ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు