ప్రభాస్‌ ఆ సినిమాలో నటించడం లేదంట

6 Apr, 2021 15:05 IST|Sakshi

ముంబై: గత కొన్ని రోజులుగా హిందీ రీమేక్ ‘రాంబో‌’లో టైగర్‌ ష్రాఫ్‌కు బదులుగా ప్రభాస్‌ నటిస్తున్నట్లు వార్తలు బాలీవుడ్‌లోనే కాక టాలీవుడ్‌లోనూ షికార్లు కొడుతున్నాయి. సిద్దార్థ్ ఆనంద్‌ దర్శకత్వంలో టైగర్‌ ష్రాఫ్‌ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ‘రాంబో’ చిత్రం లో టైగర్‌ నటించడం లేదని వస్తున్న వార్తలకు చెక్‌ పెడుతూ ‌ష్రాఫ్‌  క్లారిటీ ఇచ్చాడు.  


‘రాంబో’ చిత్రంలో తానే లీడ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు పేర్కొన్న ష్రాఫ్‌ డేట్స్‌ కుదరక తనకు బదులుగా మరొక హీరోను తీసుకున్నట్లు వస్తున్న వార్తలు పుకార్లని తెలిపాడు. అలాగే చిత్ర దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌ కూడా ప్రభాస్‌ను రాంబో కోసం సంప్రదించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎందుకంటే తను ఇంకా రాంబో యూనిట్‌తో టచ్‌లోనే ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాట వాస్తవమే అలాగే దర్శకుడు సిద్దార్థ్‌ కూడా షారఖ్‌ ఖాన్‌ హీరోగా ‘పఠాన్’‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో సిద్దార్థ్‌ కూడా ఖాళీ లేకపోవడం కారణంతో రాంబో సినిమా కొంచం సమయం పడుతోంది తప్ప మరే కారణం లేదని వివరణ ఇచ్చాడు. సిల్వెస్టర్ స్టలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి రిమేక్‌. ఈ చిత్రం హాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచింది. మరి బాలీవుడ్‌లో ఏ రేంజ్‌ హిట్‌ అవుతుందో చూడాలి.

( చదవండి: 6 ఏళ్ల తర్వాత అమితాబ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్న దీపికా )

మరిన్ని వార్తలు