Radhe Shyam Release: ఓటీటీలో నేరుగా రాధేశ్యామ్​ ?.. ఇదిగో క్లారిటీ..

26 Jan, 2022 17:05 IST|Sakshi

Prabhas Radhe Shyam Is Release Directly On OTT: పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరిలో విడుదలవుతుంది అనుకున్న రాధేశ్యామ్​కు అనేకసార్లు బ్రేక్​ పడింది. దీంతో ప్రేక్షకుల్లో, ప్రభాస్​ హార్ట్​కోర్​ ఫ్యాన్స్​లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే ఈ లవ్​స్టోరీని థియేటర్లలో కాకుండా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చే అవకాశం ఉందని ఇదివరకే పలుమార్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన రాధేశ్యామ్ మేకర్స్ తమ ప్రాధాన్యం థియేటర్లే అని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రాధేశ్యామ్​ రిలీజ్​ ఎందులో అనే విషయంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. 

అయితే రాధేశ్యామ్ చిత్రాన్ని ఓటీటీలోనే రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్​ఫ్లిక్స్​, జీ5 నుంచి ఈ సినిమాకు భారీ ఆఫర్​ వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఆఫర్​ మేకర్స్​కు కూడా నచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అన్నీ ఓకే అయితే ఈ రెండింటిలో ఏదో ఒక ఓటీటీ ప్లాట్​ఫామ్​లో రాధేశ్యామ్​ చిత్రాన్ని రిలీజ్​ చేసే అవకాశం ఉందన్న వార్తలు నెట్టింట్లో వైరల్​ అవుతున్నాయి. తాజగా ఈ వార్తలతో రాధేశ్యామ్​ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారా ? లేదా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారా ? అనే ఆసక్తి నెలకొంది. 

మరిన్ని వార్తలు