గుడ్‌న్యూస్‌ : ప్రేమికుల రోజునే 'రాధే శ్యామ్’ టీజర్‌

6 Feb, 2021 09:27 IST|Sakshi

ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్‌డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్‌ విడుదల కానుంది. అదే రోజున సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి  అప్‌డేట్‌ రాలేదు. అయితే ఈ సినిమా పీరియాడికల్‌ లవ్‌స్టోరీ కావడంతో ప్రేమికుల రోజునే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ  ప్రేమకథా చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. రాధాకష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అయిదు బాషలలో విడుదల కాబోతుంది. (రాధేశ్యామ్‌ స్టోరీలైన్ తెలిసిపోయింది!)

యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుందని సమాచారం. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం క్లైమాక్స్‌ సీన్‌ల కోసం దాదాపుగా 30 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా సెట్స్‌ వేస్తున్నట్లు వార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కు వర్క్‌ చేస్తుండటం విశేషం. చదవండి: (ఆదిపురుష్‌ ఆరంభ్‌.. ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌)


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు