ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఉగాది కానుక వచ్చేసింది

13 Apr, 2021 08:56 IST|Sakshi

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఉగాది కానుక వచ్చేసింది. ప్రభాస్‌, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం అప్‌డేట్‌ కోసం ప్రభాస్‌ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ విడుదల చేస్తామని గతేడాది నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆ మధ్య ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.

దీంతో అభిమానులంతా యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ విమర్శలు కురిపించారు. ‘నిద్రలే యూవీ క్రియేషన్స్‌’అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్విటర్‌లో ట్రెండ్‌ చేశారు. ఉగాది రోజైనా అప్‌డేట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి అభిమానుల డిమాండ్‌ నెరవేరింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభాస్‌ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం.ఎన్నో ఫెస్టివల్స్.. కానీ ప్రేమ ఒక్కటే అంటూ ప్రభాస్‌ లవ్లీ లుక్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్‌ న‌వ్వుకుంటూ ఎంతో ఉల్లాసంగా, కొత్తగా కనిపిస్తున్నాడు. 

ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు