Prabhas Radhe Shyam: ‘రాధేశ్యామ్‌’ టీజర్‌ డేట్‌ ఫిక్స్‌.. కానీ కొంచెం వెరైటీగా..

20 Oct, 2021 11:54 IST|Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్‌’. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా వస్తున్న ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వంలో వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్, పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌లకు, మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

అక్టోబర్ 23న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది మూవీ టీం. ‘విక్రమాదిత్య ఎవరు?’ తెలుసుకునేందుకు సిద్ధంగా కావాలని తెలిపారు. అయితే ఈ టీజర్‌ని కొంచెం వెరైటీగా ఇంగ్లీష్‌ ఆడియోతో విడుదల చేయనున్నారు. అయితే మల్టీ లాంగ్వేజెస్‌లో సబ్‌ టైటిల్స్‌ రానున్నాయి. అయితే యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా పలు భాషల్లో జనవరి 14న విడుదల కానుంది. అంతేకాకుండా ఈ పోస్ట్‌కి #GlobalPrabhasDay అనే ట్యాగ్‌ని జత చేయడం విశేషం.

చదవండి: ప్రభాస్‌కు విలన్‌గా రంగంలోకి బాలీవుడ్‌ నటుడు?

మరిన్ని వార్తలు