ప్రభాస్‌ అస్సలు తగ్గట్లేదుగా.. మరో భారీ ప్రాజెక్టుకు ఓకే

17 Apr, 2021 11:30 IST|Sakshi

హీరో ప్రభాస్, బాలీవుడ్‌ దర్శకుడు ‘వార్‌’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ సినిమా రానుందనే టాక్‌ ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఊపందుకున్నాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ‘ఆదిపురుష్‌’ సినిమా షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లి, సిద్ధార్థ్‌ ఆనంద్‌ క్లుప్తంగా కథ చెప్పారట. సిద్ధార్థ్‌ ఆనంద్‌ చెప్పిన స్టోరీ లైన్‌కు ప్రభాస్‌ ఇంప్రెస్‌ అయ్యారని టాక్‌.

అంతేకాదు.. పూర్తి కథను వినేందుకు అతి త్వరలో మరోసారి కలుద్దామని కూడా సిద్ధార్థ్‌కు చెప్పారట ప్రభాస్‌. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం ముంబయ్‌లో షూటింగ్‌ చేస్తున్న ప్రభాస్‌ తన మరో చిత్రం ‘రాధేశ్యామ్‌’కు సంబంధించిన ప్యాచ్‌వర్క్‌ షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ రానున్నారు. ఇది పూర్తి కాగానే ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్‌’ షూట్‌లో పాల్గొంటారు ప్రభాస్‌.
చదవండి:
ఆటో డ్రైవర్‌కు సమంత ఊహించని గిప్ట్‌
సల్మాన్‌ బ్యాడ్‌లక్‌.. ఈ ఏడాది కూడా లేనట్లే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు