ప్రభాస్‌ ఫోన్‌ చేసి.. సినిమాని ప్రమోట్‌ చేస్తానన్నాడు: పూరి

20 Oct, 2021 08:15 IST|Sakshi

‘‘రొమాంటిక్‌’ మూవీ ట్రైలర్‌ నిజంగానే రొమాంటిక్‌గా ఉంది. ఆకాష్‌ అద్భుతంగా నటించాడు. పదేళ్ల అనుభవం ఉన్నట్లుగా, స్టార్‌ స్టేటస్‌ వచ్చినట్లుగా లాస్ట్‌ షాట్‌లో అద్బుతంగా అనిపించాడు. యాక్టర్‌గా ఆకాష్‌ ఇంప్రూవ్‌ అయ్యాడు. అనిల్‌ సినిమాను బాగా డైరెక్ట్‌ చేశారు’’ అన్నారు ప్రభాస్‌. ఆకాష్‌ పూరి, కేతికా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రొమాంటిక్‌’. అనిల్‌ పాదూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్, చార్మి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో వాస్కో పాత్రలో ఆకాష్, మౌనిక పాత్రలో కేతిక నటించారు.  

హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హీరో ప్రభాస్‌ ‘రొమాంటిక్‌’ ట్రైలర్‌ను విడుదల చేసిన వీడియోను ప్లే చేశారు. అనంతరం ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే అందించిన పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ – ‘‘రొమాంటిక్‌’ను విడుదల చేస్తున్నామని తెలియగానే ఈ సినిమా గురించి ప్రభాస్‌ ఫోన్‌ చేసి పదే పదే అడిగారు. సినిమా గురించి ట్వీట్‌ వేయాలా? ఈవెంట్‌కు రావాలా? అని అడిగారు. ప్రభాస్‌ చాలా మంచివారు. ‘రొమాంటిక్‌’ సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ‘డార్లింగ్‌..’ అంటూ సాగే ఓ స్పెషల్‌ సాంగ్‌ సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతోంది. ఆకాష్, కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. గ్రాఫిక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వచ్చినా అనిల్‌ ‘రొమాంటిక్‌’ను బాగా తెరకెక్కించాడు’’ అన్నారు చార్మి.

చదవండి: ‘రొమాంటిక్‌’గా ట్రైలర్‌.. ఆకట్టుకుంటున్న ఆకాశ్‌ పూరీ

మరిన్ని వార్తలు