థియేటర్లలో ఎంజాయ్‌ చేద్దాం: ప్రభాస్‌

24 Dec, 2020 13:41 IST|Sakshi

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో సినిమా థియేటర్లన్ని మూతపడిన విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిది నెలలపాటు బిగ్ స్ర్కీన్‌పై​ సినిమా సందడి లేక థియేటర్లన్ని వెలవెలబోయాయి. అయితే కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఇటీవల థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ థియేటర్లలోకి వెళ్లి సినిమా చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. దీంతో షూటింగ్‌ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ ఈ ఏడాది థియేటర్లలో రిలీజ్‌ చేసేందుకు వెనకడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటీటీనే నమ్ముకొని అనేక సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో కొన్ని ప్రేక్షకుల మెప్పు పొందగా మరికొన్ని చతికిలపడిపోయాయి. చదవండి: మెగా ఫ్యామిలిలో మళ్లీ పెళ్లి బాజాలు..

అయితే డిసెంబర్‌లో నెలలో ఒకటి రెండు సినిమాలు థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ థియేటర్ల రీఓపెనింగ్‌పై కామెంట్‌ చేశారు. పప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాలని కోరారు. జనాలు సురక్షితంగా సినిమా చేసే అనుభవాన్ని అందించేందుకు సినిమాలు తిరిగి వస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ఓ వీడియోను విడుదల చేశారు. ‘మన సినిమాను బిగ్ స్ర్కీన్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేద్దాం’ అని అభిమానులకు పిలుపునిచ్చారు. కాగా లాక్‌డౌన్‌ అనంతరం థియేటర్లలో విడుదలవున్న పెద్ద సినిమా సోలో బ్రతుకే సో బెటర్‌. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. చదవండి: నాలుగు నెలల్లో సలార్‌ పూర్తి

ఈ సినిమా రేపు (డిసెంబర్‌ 25) క్రిస్మస్‌ రోజున థియేటర్లలలో రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతున్న తొలిచిత్రంగా ఈ సినిమా ఫిల్మ్‌ ఇండసస్టట్రీకే ఒక ముఖ్య సందర్భమని అన్నారు. ఈ చితత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్పూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదన్నారు. ప్రేక్షకులందరూ బాధ్యతగా ముఖానికి మాస్కు ధరించి సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎంజాయ్‌ చేయాని కోరుతున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు