ఐదో రోజు సలార్ కలెక్షన్స్.. అరుదైన రికార్డుకు చేరువలో!

27 Dec, 2023 21:24 IST|Sakshi

ప్రభాస్ నటించిన సలార్ ప్రభంజనం ఐదు రోజు కూడా కొనసాగింది. ఈ నెల 22న రిలీజైన ఈ చిత్రం మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. మొదటి మూడు రోజులతో పోలిస్తే.. నాలుగు, ఐదు రోజుల్లో కాస్తా తగ్గినట్లు కనిపించినా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్ల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. రూ.500 కోట్ల క్లబ్‌లో చేరితే.. బాహుబలి, బాహుబలి 2: ది కన్‌క్లూజన్ తర్వాత ప్రభాస్ మూడో చిత్రంగా సలార్ నిలవనుంది.

తొలిరోజు రూ.178.7 కోట్లు రాగా.. రెండో రోజుకే రూ.295.7 కోట్లకు చేరుకున్న వసూళ్లు.. మూడో రోజే నాలుగు వందల మార్క్‌ను దాటేశాయి. నాలుగో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు చేరుకున్న సలార్.. ఐదో రోజు అదే ఊపులో దూసుకెళ్లింది. సలార్ ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.రూ.490.23 కోట్లు కొల్లగొట్టిందని సినీ ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద గ్రాస్ కలెక్షన్స్ పరంగా సలార్ భారీ వసూళ్లను సాధించింది. 

దేశవ్యాప్తంగా చూస్తే బాక్సాఫీస్ వద్ద 5 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల మార్కుకు చేరువలో ఉంది. ఇండియా బాక్సాఫీస్ కలెక్షన్ ఐదు రోజుల్లో రూ.280.30 కోట్లకు చేరుకుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.  ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించారు. 

>
మరిన్ని వార్తలు