సలార్‌పై ప్రశాంత్‌ నీల్‌ కామెంట్‌

16 Jan, 2021 12:19 IST|Sakshi
విజయ్‌ కిరగందూర్, ప్రశాంత్‌ నీల్, ప్రభాస్‌ 

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ‘కేజీయఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ‘సలార్‌’ టైటిల్‌తో ఓ ప్యాన్‌ ఇండియా సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ భారీ యాక్షన్‌ చిత్రాన్ని హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగదూర్‌ నిర్మించనున్నారు. ‘సలార్‌’ చిత్రం ముహూర్తం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కి, విజయ్‌ కిరగందూర్‌కి ధన్యవాదాలు. ‘సలార్‌’ నిరాశపరచదు’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఈ కార్యక్రమంలో కర్నాటక డిప్యూటీ సీయం అశ్వత్థ నారాయణ్, యశ్, నిర్మాతలు ‘దిల్‌’ రాజు, డీవీవీ దానయ్య, సాయి కొర్రపాటి, నవీన్‌ యర్నేని పాల్గొన్నారు. చదవండి: ‘రాధేశ్యామ్‌’ టీమ్‌కి ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌!

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

కాగా టాలీవుడ్‌ స్టార్‌ హీరో భాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా చిత్రీకరణ జనవరి  19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు