ప్రభాస్‌ లీడర్‌

3 Dec, 2020 05:55 IST|Sakshi

ప్రభాస్‌ మంచి జోరు మీదున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్‌’ పూర్తి కావచ్చింది. ఇది సెట్స్‌లో ఉండగానే ‘ఆదిపురుష్‌’ సినిమా, ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. తాజాగా మరో సినిమా ప్రకటన వచ్చింది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ సినిమా చేస్తారని వచ్చిన వార్తలను బుధవారం కన్ఫార్మ్‌ చేశారు. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ చిత్రానికి ‘సలార్‌’ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. సలార్‌ అంటే లీడర్‌ అని అర్థం. చిత్రనిర్మాత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్‌లో ‘కేజీఎఫ్‌’, ‘కేజీఎఫ్‌ 2’ చిత్రాల తర్వాత నిర్మించనున్న మూడో ప్యాన్‌ ఇండియా చిత్రమిది. భారతదేశంలోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తాం. వచ్చే ఏడాది జనవరిలో సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా