టాలీవుడ్‌ నెం.1 హీరో ప్రభాస్‌.. హీరోయిన్‌ సమంత!

15 Sep, 2022 17:26 IST|Sakshi

బాహుబలి చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్‌. ఆ తర్వాత వరుసగా పాన్‌ ఇండియా సినిమా చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తున్నాయి. అయితే బహుబలి సిరీస్‌ తర్వాత ప్రభాస్‌ నటించిన ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. కానీ వీటి ప్రభావం మాత్రం ప్రభాస్‌ క్రేజ్‌పై పడలేదు. అంతేకాదు రెమ్యునరేషన్‌ కూడా పెంచాడే తప్ప తగ్గించిందే లేదు. రాధేశ్యామ్‌ కంటే ముందు ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ రూ.100 కోట్లు.

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలకు రూ.120 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడట. నిర్మాతలు కూడా ప్రభాస్‌ డిమాండ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్‌ సినిమాకు హిట్‌ టాక్స్‌ వస్తే చాలు.. రూ.1000 కోట్లు వచ్చేస్తాయనే ధీమాలో వాళ్లు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌ మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్‌ నటుల్లో మొదటి స్థానంలో నిలిచాడు.

ప్రముఖ మీడియా సంస్థ‌ ఆర్మాక్స్ ప్రతి నెల  దేశంలోని సెలబ్రిటీల గురించి సర్వే నిర్వహించి..టాప్‌ పొజిషన్‌లో ఉన్న లిస్ట్‌ని విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఆగస్ట్‌ నెలలో అత్యంత ప్రజాదరణ పొందిన టాలీవుడ్‌ నటీ నటుల సర్వే జాబితాను వెల్లడించింది. హీరోల్లో ప్రభాస్‌, హీరోయిన్లలో సమంత మొదటి స్థానంలో నిలిచారు. ప్రభాస్‌ తర్వాత ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌,మహేశ్‌ బాబు వరుస స్థానాల్లో ఉన్నారు. హీరోయిన్లలో కాజల్‌, అనుష్క తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

మరిన్ని వార్తలు