Prabhas Remuneration: బడ్జెట్‌ రూ.300 కోట్లు, అందులో సగం రెబల్‌ స్టార్‌కే!

24 Nov, 2021 20:27 IST|Sakshi

Pan India Star Prabhas Remuneration: బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్‌. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. నానాటికీ పెరిగిపోతున్న ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శక నిర్మాతలు ప్రభాస్‌తో పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాలు చేస్తున్నారు. అలా ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌, ప్రాజెక్ట్‌ K, సలార్‌, స్పిరిట్‌ చిత్రాలున్నాయి. అన్నీ పాన్‌ ఇండియా సినిమాలే చేస్తున్న ప్రభాస్‌ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం డార్లింగ్‌ 'స్పిరిట్‌' సినిమాకు అక్షరాలా రూ.150 కోట్లు తీసుకుంటున్నాడట! స్పిరిట్‌ బడ్జెట్‌ రూ.300 కోట్లు అయితే అందులో సగం మన రెబల్‌ స్టార్‌కే ఇస్తున్నారన్నమాట! 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను ఎనిమిది భాషల్లో రూపొందిస్తుండగా బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్ నిర్మిస్తున్నారు. మొత్తానికి మన తెలుగు హీరో తొలిసారి ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. భారత్‌లో ఇంత భారీ మొత్తం పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరోగా ప్రభాస్‌ రికార్డులకెక్కాడు.

మరిన్ని వార్తలు