బాలీవుడ్ టాప్‌ హీరోతో ప్రభాస్ మల్టీ స్టారర్?

9 Mar, 2021 13:15 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టించిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుండగా.. ఆదిపురుష్, సలార్‌ చిత్రీకరణ దశలో ఉన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది విడుదలకు రెడీగా ఉన్నాయి. ఇవే కాక ప్ర‌భాస్-నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న కొత్త చిత్రం ఈ వేసవిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఈ మూవీని సైంటిఫిక్ థ్రిల్ల‌ర్‌గా భారీ బ‌డ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ క్రమంలో ప్రభాస్‌ సినిమాల కోసం అభిమానులు కొండంత ఆశలతో ఎదురుచూస్తున్నారు. 

ఇదిలా ఉండగా డార్లింగ్‌కు సంబంధించిన మరో కొత్త అప్‌డేట్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ప్ర‌భాస్‌.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్‌తో క‌లిసి ఓ మల్టిస్టారర్‌ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు స్టార్‌ హీరోలతో భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హృతిక్‌తో తలపడేందుకు ప్రభాస్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారని, వీరిద్దరి మధ్య భారీ ఫైట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. వార్, బ్యాంగ్ బ్యాంగ్ ఫేమ్ సిద్ధార్ద్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నట్లు సమాచారం‌. యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ట‌. ఇక ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.  

అయితే మన టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాల హవా కొనసాగుతున్నప్పటికీ.. బాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలు రావడం చాలా అరుదు. ఇక ఇటీవల హృతిక్‌, టైగర్‌ ఫ్రాఫ్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ మూవీ వార్‌ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ప్రభాస్‌, హృతిక్‌ సినిమాకు బీటౌన్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లభిస్తుందో వేచి చూడాలి. 

చదవండి: 

ముంబైలో కొత్తింటి కోసం ప్రభాస్‌​ వెతుకులాట!

వైరల్‌: బ్యాలెన్స్‌ తప్పిన కృతి.. నెటిజన్ల ట్రోలింగ్‌!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు