Prabhas Knee Surgery: ప్రభాస్‌ మోకాలికి సర్జరీ... నెల రోజుల పాటు విశ్రాంతి!

27 Sep, 2023 12:09 IST|Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడం కోసం ఆయన యూరప్‌ వెళ్లాడు. ఆ సర్జరీ సస్సెస్‌ఫుల్‌గా పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన యూరప్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దాదాపు నెల రోజుల వరకు ప్రభాస్‌ రెస్ట్‌ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ ఎండింగ్‌ తిగిరి ఇండియాకు రానున్నట్లు సమాచారం. నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌ నుంచి షూటింగ్‌లో పాల్గొంటారట. 

అసలేం జరిగింది?
బాహుబలి సినిమా షూటింగ్‌ సమయంలో నెలల తరబడి యాక్షన్‌ సీన్స్‌ చేయడంతో ప్రభాస్‌కు మోకాకి నొప్పి సమస్య వచ్చింది. ఆ మధ్య తాత్కాలిక చికిత్స తీసుకొని షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆదిపురుష్‌, సలార్‌ సినిమాల షూటింగ్‌ మోకాలి నొప్పితోనే పూర్తి చేశాడు. అయితే నొప్పి మరింత తీవ్రతరం కావడంతో సర్జరీ చెయించుకోవాలని నిర్ణయించుకున్నారు. 

గ్యాప్‌లో ఆపరేషన్‌
ప్రభాస్‌ నటించిన సలార్‌ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కావాల్సింది.అయితే అనూహ్యంగా వాయిదా పడింది. ఈ విషయం ప్రభాస్‌కి ముందే తెలియడంతో ప్రాజెక్ట్‌ కే(కల్కీ 2898 ఏడీ), మారుతి సినిమాల షూటింగ్‌కి కాస్త బ్రేక్‌ ఇచ్చి విదేశీ పర్యటనకు వెళ్లాడు. శస్త్ర చికిత్స పూర్తి చేసుకొని 15 రోజుల్లో తిరిగి రావాలని ముందుగా ప్లాన్‌ చేసుకున్నారట. అయితే వైద్యుల సలహా మేరకు దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండి రెస్ట్‌ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తిరిగి రాగానే ప్రాజెక్ట్‌ కేతో పాటు మారుతి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. 

మరిన్ని వార్తలు