హీరోయిన్‌తో ముద్దు సీన్‌.. తండ్రికి ఫోన్‌ చేసిన ప్రభాస్‌

6 Apr, 2021 16:52 IST|Sakshi

బాహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్‌. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రభాస్‌ అంటే ఆరడుగుల మంచితనం..ఇదీ ప్రభాస్‌ను దగ్గరనుంచి చూసిన వాళ్లు చెప్పే మాట. ప్రభాస్‌ ఎంతో మొహమాటస్తుడని అంటుంటారు వాళ్లు. అంతేకాకుండా కొత్త వాళ్లతో మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడుతుంటారని ప్రభాస్‌ సన్నిహితులు చెబుతుంటారు. రియల్‌ లైఫ్‌లోనే కాదు, రీల్‌ లైఫ్‌లోనూ ప్రభాస్‌ సిగ్గరి. హీరోయిన్లతో రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటించేనప్పుడు ప్రభాస్‌ చాలా మొహమాటపడుతుంటాడని, డైరెక్టర్‌ రాజమౌళి సైతం ఓ సందర్భంలో చెప్పారు. బాహుబలి సినిమా సమయంలో తనకు యాక్షన్‌ సీన్లు డైరెక్ట్‌ చేయడం కంటే ప్రభాస్‌తో రొమాన్స్‌ చేయించడానికి చాలా కష్టపడ్డాను అని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రభాస్‌కి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అది ఏంటంటే.. 2003లో ఆర్తి అగర్వాల్‌తో కలిసి ప్రభాస్‌ అడవి రాముడు అనే సినిమాలో నటించాడు. అయితే ఈ సినిమాలో ఓ ముద్దు సన్నివేశంలో నటించాల్సి వచ్చినప్పుడు ప్రభాస్‌.. వాళ్ల నాన్నకు ఫోన్‌ చేశాడట.

ముద్దు సీన్‌ చేయడానికి తండ్రి వద్ద నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే నటించాడట. ఈ విషయాన్ని ప్రభాస్‌ మేనేజర్‌, నటుడు ప్రభాస్‌ శ్రీను ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రభాస్‌కు వాళ్ల నాన్న గారంటే ఎంతో గౌరవం అని, ఏ చిన్న విషయాన్నైనా ఆయన అనుమతి తీసుకునేవారని తెలిపాడు. ప్రపంచ వ్యాప్తంగా ఇంత పేరొచ్చినా, ఎంతో ఒదిగి ఉండే వ్యక్తిత్వం ప్రభాస్‌దని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్‌ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. 

చదవండి :  
ప్రభాస్‌ లగ్జరీ కారు! ఖరీదు ఎంతంటే?

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’: కేవలం ఈ ఒక్క పార్ట్‌కే రూ.300 కోట్లు ఖర్చు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు