ఈ హీరోయిన్‌ నాకన్నా పొడవుగా ఉందేంటి!: ప్రభాస్‌

4 Mar, 2021 15:34 IST|Sakshi

'జాతి రత్నాలు' సూపర్‌ అంటున్న ప్రభాస్‌

సెక్యూరిటీ గార్డుతో లొల్లి పెట్టుకుంటూ, లిఫ్టులో అంత్యాక్షరి ఆడుతూ ఆగమాగం చేస్తోంది జాతి రత్నాలు టీమ్‌. ఈ రోజు ట్రైలర్‌ లాంచ్‌ కోసం ఈ మూవీ యూనిట్‌ ముంబై వెళ్లింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. ఇందులో చిత్రయూనిట్‌ ప్రభాస్‌ అన్నను కలవాలంటూ సెక్యూరిటీ గార్డుతో సరదాగా గొడవకు దిగింది. ఎలాగోలా బిల్డింగ్‌ లోపలకు చేరుకున్నాక ప్రభాస్‌ అన్న వస్తుండు, మడత మంచాలు కాదు, మంచి సోఫా సెట్టేయండి అంటూ నవీన్‌ పొలిశెట్టి అక్కడున్నవాళ్లకు ఆర్డర్లు వేస్తున్నాడు.

అసలు డార్లింగ్ నాకెంత క్లోజ్‌ అనుకుంటున్నారు? అతడు‌ నా చిన్ననాటి ఫ్రెండు అని పోజులు కొడుతూ ఏ నంబరూ డయల్‌ చేయకుండానే ఫోన్‌లో పిచ్చాపాటీగా కబుర్లు చెప్తున్నాడు. ఇంతలో ప్రభాస్‌ వెనక నుంచి చెయ్యి వేయగానే ఖంగు తిన్న నవీన్‌ ఒక్క సెల్ఫీ అంటూ హీరోను అర్థించాడు. ప్రియదర్శి కూడా ప్రభాస్‌ను చూడగానే ఇది కలా? నిజమా? అన్నట్లు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అయితే జాతి రత్నాలు హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లాను చూసి ఈ హీరోయిన్‌ ఏంటి? నాకన్నా పొడవుగా ఉంది? అని ప్రభాస్‌ ఆశ్చర్యపోవడం గమనార్హం. మొత్తానికి ప్రభాస్‌ చేతుల మీదుగా నేడు సాయంత్రం 4.20 గంటలకు జాతి రత్నాలు ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇప్పటికే ఆ ట్రైలర్‌ చూసిన ప్రభాస్‌ సూపర్‌గా ఉందని మెచ్చుకున్నారు. ఈ కొద్ది సేపటికే ఇంత నవ్వుకుంటే సినిమా ఇంకెంత బాగుంటుందోనని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

 

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ నవీన్‌ పోలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది.

చదవండి: సైకోగా చేయాలని ఉంది!: జాతి రత్నాలు హీరోయిన్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు