‘రాధేశ్యామ్’ సర్‌ప్రైజ్‌.. ప్రభాస్‌ లుక్‌ అదుర్స్‌

21 Oct, 2020 14:58 IST|Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్యాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’సర్‌ప్రైజ్ వచ్చేసింది. ప్రభాస్‌ పుట్టిన రోజు(అక్టోబర్‌ 23) సందర్భంగా సినిమాలో ప్రభాస్‌ పాత్ర పేరును రివీల్‌ చేస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ వదిలింది చిత్రబృందం. రాదేశ్యామ్‌లో విక్రమాదిత్యగా ప్రభాస్‌ అలరించనున్నాడు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా రాయల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన హీరో మూవీ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ ప్యాన్‌ ఇండియా సినిమాకి రాధా కృష్ణకుమార్‌ దర్శకుడు. కృష్ణంరాజు సమర్పణలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
(చదవండి : ‘రాధే శ్యామ్‌’ లో ప్రేరణగా పూజా.. ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌)

ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పేరు ప్రేరణ. పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్‌. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన 'బీట్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌'ను అక్టోబర్‌ 23న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు వచ్చింది. ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా అతి తక్కువమంది బృందంతో యూరప్‌లో షూటింగ్‌ జరుగుతోంది. పలు హిట్‌ చిత్రాలకు స్వరాలందించిన జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు