ప్రేరణతో ప్రణయ గీతంలో విహరిస్తున్న విక్రమాదిత్య

26 Jun, 2021 08:22 IST|Sakshi

‘రాధేశ్యామ్‌’ కోసం ప్రేరణతో కలిసి ప్రణయ గీతం ఆలపిస్తున్నారు విక్రమాదిత్య. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘రాధేశ్యామ్‌’. ఇందులో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ తిరిగి శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ప్రభాస్, పూజా హెగ్డేపై ఓ ప్రణయ గీతాన్ని చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఈ పాట పూర్తయిన తర్వాత కొంచెం ప్యాచ్‌ వర్క్‌ జరిగితే ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ పూర్తయిపోయినట్లే. కృష్ణంరాజు కీలక పాత్ర చేసిన ఈ సినిమాను గతంలో ఈ ఏడాది జూలై 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే  కోవిడ్‌ పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. 

చదవండి : Radhe Shyam: వామ్మో.. సెట్స్‌ కోసమే అన్ని కోట్లా?
కమెడియన్‌ అలీ సినిమాకు ప్రభాస్‌ ప్రమోషన్స్‌

మరిన్ని వార్తలు