ఆ దర్శకుడు ఏదో ఆశించాడు, ఇప్పటికీ..: హీరోయిన్‌

20 Apr, 2021 10:56 IST|Sakshi

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనయ్యామంటూ గతంలో ఎందరో నటీమణులు మీడియా ముందు వాపోయారు. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమం కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చింది. ఇక ఇటీవలే దివంగత నటుడు సుశాంత్‌ రాజ్‌పుత్‌ మాజీ ప్రేయసి అంకితా లోఖండే సైతం చిత్రపరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు.

తాజాగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రాచీ దేశాయ్‌ కెరీర్‌ తొలినాళల్లో చవిచూసిన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. ఓ సినిమా నటించేందుకు దర్శకుడు తన నుంచి ఏదో ఆశించారని తెలిపింది. వారి ఉద్దేశం అర్థమై వెంటనే నాకు ఆ సినిమానే వద్దంటూ వచ్చేశానని చెప్పింది. అయితే ఆ డైరెక్టర్‌తో సినిమాలో నటించనని కరాఖండిగా చెప్పినప్పటికీ అతడు ఇప్పటికీ తరచూ ఫోన్లు చేస్తున్నాడని వాపోయింది. అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా అతడి సినిమాల్లో నటించనని తేల్చి చెప్పానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఇక ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడానికి ప్రధాన కారణమేంటో చెప్పింది ప్రాచీ దేశాయ్‌. ఎన్నో అవకాశాలు తన దగ్గరి దాకా వస్తున్నాయని, కానీ ఆ పాత్రలు నచ్చక వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఉన్నత హోదాలో ఉండాలన్న కుతూహలం తనకు లేదని, తనకు ప్లస్‌ అయ్యే పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది.

చదవండి: ‘అప్పట్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొన్నాం, కానీ!’

బేరాలు వద్దు: కాజల్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

మరిన్ని వార్తలు