తండ్రి మరణంపై తొలిసారిగా స్పందించిన ప్రదీప్‌

23 May, 2021 21:16 IST|Sakshi

ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు తండ్రి ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు తండ్రి మరణంపై స్పందించని ప్రదీప్‌ తాజాగా నోరు విప్పాడు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటు సోషల్‌ మీడియా వేదికగా భావోద్యేగానికి లోనయ్యాడు. ఆదివారం ప్రదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్‌ చేశాడు. ‘ఐ లవ్ యు నాన్న, ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే.  జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైన చిరునవ్వుతో ఎలా ఎదుర్కొవాలో నేర్పించారు. నేను ఏం  చేసినా మీకు గౌరవం కలిగించే పని చేస్తాను’ అంటు రాసుకొచ్చాడు.  

‘అలాగే ‘నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది మంచి చెడు అనేది ఆలోచించకుండా మీరు నా వెంట ఉన్నారు. బాధతో ముక్కలైన నా మనస్సును మీ ప్రేమతో బాగు చేసేవారు. మీ ధైర్యం నాకు ఎన్నో సార్లు స్ఫూర్తినిచ్చింది. అలాగే నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసింది. దానిని మించిన ప్రేమ లేదు. మీరు నాకు ఎప్పటికీ స్పెషల్. జీవితంలో నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని ప్రేమించడం మాత్రం ఆపలేను. మీరు కోరుకున్నట్లుగానే ఎప్పుడూ నా చూట్టు ఉన్నవారిని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ నవ్విస్తూనే ఉంటా. ఇక మనం కలిసే దాకా మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటా నాన్న.. ఐ మిస్‌ యూ’ అంటూ ప్రదీప్‌ తన ఏమోషనల్‌ పోస్టుతో అందరిని కదిలించాడు. కాగా ఇటీవల ప్రదీప్‌ కరోనా పాజిటివ్‌గా పరీక్షించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిన అనంతరం హో క్వారంటైన్‌కు వెళ్లిన ప్రదీప్‌ ఇప్పటి వరకు తన ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. ఈ క్రమంలో అతడి తండ్రి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన వార్త ప్రదీప్‌ అభిమానులను, సన్నిహితులను కలచివేసింది. 

A post shared by pradeep machiraju (@pradeep_machiraju)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు