యాంకర్‌ ప్రదీప్‌ నెల సంపాదన ఎంతో తెలుసా?

5 Feb, 2021 20:31 IST|Sakshi

బుల్లితెరపై హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రదీప్‌ మాచిరాజు. తనదైన పంచ్‌లు, యాంకరింగ్‌తో సుమ కనకాల తరువాత టాలీవుడ్‌లో అంతటి పేరును సొంతం చేసుకున్న వ్యక్తి ప్రదీప్‌ ఒక్కడే. ఇటీవలే ఈయన‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 29 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. కాగా టెలివిజన్‌లో అత్తా కోడళ్ళు షోతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రదీప్‌ కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ఒకానొక సమయంలో వంద రూపాయల కోసం కూడా ఎంతో కష్టపడినట్లు చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది.

ప్రస్తుతం పలు చానల్స్ లో అనేక షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్..‌ స్టార్ యాంకర్‌ కొనసాగుతున్నాడు. ఇతనికి యూత్‌, అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. అయితే టీవీ షోలు, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రదీప్ నెలకు ఎంత సంపాదిస్తున్నాడన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రదీప్ నెలకు దాదాపు రూ. 40 నుంచి 50 లక్షల వరకు సంపాదిస్తున్నాడనే టాక్ ఫిలీం వర్గాల్లో వినిపిస్తోంది. 
చదవండి: 30 రోజుల్లో..ఫస్ట్‌డే కలెక్షన్లు.. ప్రదీప్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

రెండేళ్ల క్రితం ప్రదీప్ టీవీ షోలలో ఒక్కో ఎపిసోడ్‌కు రూ 75 వేల వరకు తీసుకునేవాడట. అయితే ఇప్పుడు అదే షోకు ప్రదీప్ అక్షరాలా లక్షన్నరకు పైగా తీసుకుంటున్నాడనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రానికి పాతిక లక్షల వరకు తీసుకున్నట్లు సమాచారం. అంటే ఈ స్టార్‌ యాంకర్‌ దాదాపు ఏడాదికి ఆరు కోట్లకు పైగా సంపాదిస్తున్నడన్న మాట. ఈ మొత్తం టాలీవుడ్ యంగ్ హీరోలు కూడా ఇంత భారీ మొత్తంలో సంపాదించడం లేదని టాక్‌. 
చదవండి: ఠాగూర్‌ మధుపై ‘క్రాక్’ డైరెక్టర్ ఫిర్యాదు
చదవండి: పిట్టకథలు ట్రైలర్‌: ఎంతమంది మొగుళ్లే నీకు..

చదవండి: ఐస్‌క్రీమ్‌ తింటున్న స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?

మరిన్ని వార్తలు