నా కల నిజమైంది.. ఒకసారి గిల్లి చూసుకున్నా: ప్రగ్యా జైస్వాల్‌

26 Jan, 2022 07:55 IST|Sakshi

‘‘సల్మాన్‌ ఖాన్‌ సార్‌తో పని చేయాలని ప్రతి ఆర్టిస్టుకీ ఒక కల ఉంటుంది. నేను సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు కన్న కల ఇప్పుడు నిజమైంది. హిందీలో నా తొలి ప్రాజెక్టుతోనే (‘అంతిమ్‌’) ఆయనతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని హీరోయిన్‌ ప్రగ్యా జైస్వాల్‌ అన్నారు. ‘కంచె, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర, అఖండ’ వంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్యా ‘అంతిమ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

ఇటీవల ఆమె ఓ సందర్భంలో మాట్లాడుతూ–‘‘సల్మాన్‌ సార్‌తో నటించడం చాలా అదృష్టంగా భావించడంతో పాటు గర్వంగా ఉంది. ‘మైన్‌ ఛాలా..’ వంటి అద్భుతమైన రొమాంటిక్‌ పాటలో ఆయనతో కలిసి స్టెప్పులేసింది నేనేనా? అని ఒకసారి గిల్లి చూసు కున్నాను. గురు రంధ్వ, లులియా వంతూర్‌ ఈ మెలోడీని అద్భుతంగా ఆలపించారు. ఈ పాట ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. 

మరిన్ని వార్తలు