ప్రగ్యా జైస్వాల్‌కు భలే ఛాన్స్‌

2 Feb, 2021 06:17 IST|Sakshi
ప్రగ్యా జైస్వాల్‌

‘కంచె’ ఫేమ్‌ ప్రగ్యా జైస్వాల్‌ భలే లక్కీ చాన్స్‌ కొట్టేశారు. హిందీ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని పొందారు ప్రగ్యా. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ చిత్రం ‘అంతిమ్‌’. ఇందులో సల్మాన్‌ బావమరిది ఆయుష్‌ శర్మ విలన్‌గా నటిస్తున్నారు. సల్మాన్‌కి జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ నటిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ కూడా ప్రారంభించారామె.

ఈ సినిమాతో పాటు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తున్నారు ప్రగ్యా. రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌తో ఈ ఏడాదిని సూపర్‌గా ఆరంభించారు ప్రగ్యా జైస్వాల్‌.

చదవండి:
రాజమౌళి-మహేష్‌ మూవీ స్టార్ట్‌ అయ్యేది అప్పుడేనా!

మరిన్ని వార్తలు