దేశంలోనే ఫస్ట్‌ ఫిమేల్‌ కామెడీ క్రియేటర్

6 Dec, 2020 08:32 IST|Sakshi

ప్రజక్త కోలి.. గురించి తెలియని యూట్యూబ్‌ వ్యూయర్స్‌ ఉండరు. ఆమె.. దేశంలోనే ఫస్ట్‌ ఫిమేల్‌ కామెడీ క్రియేటర్‌. వెబ్‌సిరీస్‌ నటీమణుల పరిచయ కాలంలో యూట్యూబర్‌ ఇంట్రడక్షన్‌ ఏంటీ? అనుకోవద్దు. నెట్‌ఫ్లిక్స్‌ ‘మిస్‌మ్యాచ్డ్‌’ తో ప్రజక్తా ఇప్పుడు వెబ్‌స్క్రీన్‌ మీదా ఎంట్రీ ఇచ్చింది. 

  • పుట్టిపెరిగింది ముంబైలో. మనోజ్‌ కోలి, అర్చన కోలి .. ఆమె తల్లిదండ్రులు.  ముంబై యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. 
  • డిగ్రీ పూర్తవగానే రేడియో జాకీగా కెరీర్‌ మొదలుపెట్టింది. ఆర్‌జేగా ఆమె చేసిన హృతిక్‌ రోషన్‌ ఇంటర్వ్యూ చాలా పాపులర్‌ అయింది. అదివిన్న ‘వన్‌ డిజిటల్‌’ యూట్యూబర్‌ సుదీప్‌ ఆమెను యూట్యూబ్‌ చానెల్‌ పెట్టమని ప్రోత్సహించాడు. 
  •  అలా 2015లో ‘మోస్ట్‌లీ సేన్‌’ను లాంచ్‌ చేసింది. ‘10 హిలేరియస్‌ వర్డ్స్‌ దట్‌ డిల్లీ పీపుల్‌ యూజ్‌’ అనే వీడియోతో ఆ చానెల్‌ క్లిక్‌ అయింది. 
  •  యూట్యూబ్‌ చానెల్స్‌ తొలినాళ్లలోనే వన్‌ మిలియన్‌ సబ్‌స్క్రైబర్స్‌తో ప్రజక్త.. దేశంలోనే ఫస్ట్‌ ఫిమేల్‌ కామెడీ క్రియేటర్‌ అనే క్రెడిట్‌ను సాధించింది. 
  • సమకాలీన పరిస్థితులు, ఒరవడుల మీద  ఆమె చేసే కామెడీ వీడియోలు దేశీ ప్రేక్షకులనే కాదు విదేశీ వీక్షకులనూ కడుపుబ్బ నవ్విస్తాయి. ఆ ప్రతిభ యునైటెడ్‌ నేషన్స్‌ చెవినా పడింది. ఆ హాస్యచతురతను ప్రత్యక్షంగా చూసేందుకు ప్రజక్త వీడియోలను యూఎన్‌ స్క్రీన్‌ చేసింది. 
  •  ఇటీవలే యూట్యూబ్‌ ‘గ్లోబల్‌ ఇనిషీయేటివ్‌ క్రియేటర్స్‌ ఫర్‌ చేంజ్‌’కి ఇండియన్‌ అంబాసిడర్‌గా ఎన్నికైంది కూడా. 
  • ఆమె హావభావాలు, చక్కటి టైమింగ్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌  ప్రజక్తకు చలనచిత్ర, వెబ్‌పరిశ్రమలో అవకాశాలను కల్పించాయి. ముందుగా తన నటనా నైపుణ్యాన్ని ‘ఖయాలీ పులావ్‌’ అనే షార్ట్‌ ఫిల్మ్‌తో పరీక్షించుకుంది. సూపర్‌ హిట్‌ అయింది. 
  •   ఆ తర్వాత  నెట్‌ఫ్లిక్స్‌ ఒరిజినల్‌ ‘మిస్‌మ్యాచ్డ్‌’లో లీడ్‌ రోల్‌లో  నటించి  మెప్పించింది.. శభాష్‌ అనే కితాబూ పొందింది. 
మరిన్ని వార్తలు