అప్పుడు స్టూడియో బయటకు వెళ్లి ఏడ్చాను: ప్రకాశ్‌ రాజ్‌

13 Oct, 2021 12:26 IST|Sakshi

‘మా’ ఎన్నికల్లో ఓడిన ప్రకాశ్‌ రాజ్‌ తన ప్యానల్లో గెలిచిన సభ్యులతో కలిసి ముకుమ్ముడిగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇలా రాజీనామా, ఆరోపణలతో పరిశ్రమలో రచ్చ కొనసాగుతుండగా.. ఇటీవల ఆయన ఓ టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన తనకు సంబంధించిన పలు ఆసక్తిక విషయాలను పంచుకున్నారు. ఈ మేరకు ఆయన వెండితెర ఎంట్రీ గురించి హోస్ట్‌ అడగ్గా ప్రకాశ్‌ రాజ్‌ స్పందిస్తూ..  తన సొంతూరు బెంగళూరని, పుట్టి పెరిగిందంతా అక్కడే అని చెప్పారు. అలాగే బెంగళూరులో ఉన్నపుడు నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడినని, అలా నటనపై ఆసక్తి కలిగిందన్నారు. ఇలా ఓ నాటకంలో నా ప్రదర్శన చూసిన సీనియర్‌ నటి లక్ష్మీ గారు దక్షిణాన గొప్ప నటుడివి అవుతావని ప్రశంసించారని చెప్పారు. 

చదవండి: బిగ్‌బాస్‌ 5: స్పెషల్‌ ఎపిసోడ్‌లో ఆది, 25 నిమిషాలకే షాకింగ్‌ రెమ్యునరేషన్‌!

‘ఓ సారి నా ఫొటోను ఆర్టిస్ట్‌ గీత బాలచందర్‌కు పంపించారు. ఆ తర్వాత నేను కూడా ఒకసారి వెళ్లి ఆయనను కలిశాను. 9 నెలల తర్వాత ఓ రోజు బాలచందర్‌ ఫోన్‌ చేసి అవకాశం ఇచ్చారు. అలా డ్యూయెట్‌లో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా అంతగా విజయం సాధించనప్పటికీ నా కెరీర్‌కు ఉపయోగపడింది’  అంటూ చెప్పుకొచ్చారు. ఇక గతంలో తనపై విధించిన నిషేధంపై ఈ సందర్భంగా హోస్ట్‌ ఆయనను ప్రశ్నించగా ఇందుకు ప్రకాశ్‌ రాజ్.. మహేశ్‌ బాబుతో ఆగడు సినిమా చేయాల్సి ఉందని, ఆ సినిమా సమయంలోనే జరిగిన ఓ సంఘటన నేపథ్యంలో తనని బ్యాన్‌ చేశారన్నారు. ‘శ్రీనువైట్ల ‘ఆగడు’ మూవీ షూటింగ్‌ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో నా డేట్స్‌ కుదరలేదు. వెంటనే దర్శకుడు శ్రీను వైట్ల నా స్థానంలో సోనూ సూద్‌ను తీసుకున్నారు.

చదవండి: పుష్ప: అదిరిపోయిన రష్మిక ‘శ్రీవల్లి’ సాంగ్‌

దీనిపై నేను ప్రశ్నంచడంతో బూతులు తిట్టానని ఆరోపిస్తూ నాపై నిషేధం విధించారు’ అని ఆయన తెలిపారు. అంతేగాక ఏ భాషలోనైనా తన డబ్బింగ్‌ తానే చెప్పుకుంటానని, ఎందుకంటే భాష మాట్లాడకపోతే మన ప్రదర్శన కనిపించదన్నారు. తన మొదటి తెలుగు సినిమాకు సాయి కుమార్‌ తమ్ముడు రవి డబ్బింగ్‌ చెప్పారని, అప్పడు బాలసుబ్రహ్మణ్యం స్టూడియో డబ్బింగ్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఆ సమయంలో తాను ఆయనకు అలా కాదు ఇలా అంటూ సూచనలు ఇస్తుంటే నామీదకు అరిచి బయటకు వెళ్లామంటూ గట్టిగా అరిచారని చెప్పారు. దీంతో స్టూడియో బయటకు వచ్చి ఏడ్చేశానని, అయితే తనకు భాష నేర్చుకోవడం అన్న, సాహిత్యం చదవడమన్న ఇష్టమన్నారు. భాష నేర్చుకోవడమంటే వారి సంస్కృతిని గౌరవించినట్లు అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు