Prakash Raj: అప్పు ఎక్స్‌ప్రెస్‌ పేరిట అంబులెన్స్‌ అందజేసిన ప్రకాశ్‌ రాజ్‌

7 Aug, 2022 15:24 IST|Sakshi

పవర్‌ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ జ్ఞాపకార్థం సమాజ సేవా కార్యక్రమంలో భాగంగా విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 32 జిల్లాల్లో అప్పు ఎక్స్‌ప్రెస్‌ పేరుతో అంబులెన్స్‌ సేవలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం మొదటిగా మైసూరు నగరంలోని మిషన్‌ ఆస్పత్రికి అప్పు ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ను ప్రకాశ్‌ రాజ్‌ అందజేశారు. ఈమేరకు పలు ఫొటోలను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కాగా కన్నడ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌ గతేడాది అక్టోబర్‌ 29న కన్నుమూసిన విషయం తెలిసిందే!

చదవండి: బిగ్‌బాస్‌ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీరే..
ఆర్‌ఆర్‌ఆర్‌లో కష్టమైన పాత్ర రామ్‌చరణ్‌దే..

మరిన్ని వార్తలు