చిరంజీవిని కలిసిన ప్రకాశ్‌రాజ్‌

17 Aug, 2021 12:07 IST|Sakshi

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఈ రోజు ఉదయం మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. స్వయంగా చిరు ఇంటికి వెళ్లి ఆయనను కలిసి దిగిన ఫొటోను ప్రకాశ్‌రాజ్‌ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌ మారింది. ‘ఈ రోజు ఉదయం బాస్‌ని జిమ్‌లో కలిశాను. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పరిష్కారాల కోసం ఆయన చొరవ తీసుకోవడం సంతోషంగా ఉంది. మీరెప్పుడూ మాకు స్పూర్తి అన్నయ్య’ అంటూ ఆయన రాసుకొచ్చారు.

కాగా, మా ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్‌ ఈ సారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్‌ చేస్తున్న వరుస ట్వీట్‌లు ‘మా’ ఎన్నికలను మరింత వేడెక్కిస్తున్నాయి. గతంలో ఎన్నికలు ‘ఎప్పుడని’ ఒకసారి ‘తెగేవరకు లాగొద్దంటూ’ మరోసారి ఆయన చేసిన ట్వీట్‌లు ‘మా’ దుమారం రేపాయి. ఆగష్టు 15న ‘జెండా ఎగరెస్తాం’ అంటూ ట్వీట్‌ చేసి ప్రకాశ్‌రాజ్‌ అందరిని ఆలోచనలో పడేశారు. తాజాగా చిరును కలవడం కూడా ఇందులో భాగమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు