-

Prakash Raj: రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమే..కానీ...

12 Oct, 2021 17:10 IST|Sakshi

Maa elections 2021: ప్రకాశ్‌రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్‌ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఎలా ఓడిపోయారు? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, పోస్టల్‌ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నేను అసమర్థుడిని కాను.. మౌనంగా ఉన్నా అంతే : మోహన్‌ బాబు

బెనర్జీపై చేయి చేసుకున్నారు
'రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. మోహన్‌ బాబు ఎ‍న్నికల ప్రక్రియలోనే కూర్చున్నారు ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారు. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్‌ నటుడిపై చేయి చేసుకున్నారు. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన మా సభ్యులు అన్నారు. అందుకే మా ప్యానల్‌ నుంచి గెలిచిన 11మంది కలిసికట్టుగా రాజీనామా చేస్తున్నాం' అని ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. 

రాజీనామా చేసినా ప్రశ్నిస్తాం..
ఇక తన రాజీనామా గురించి మాట్లాడుతూ..మాలోనే కొనసాగుతానని, రాజీనామాను వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని, అయితే దానికి ఓ కండీషన్‌ ఉందని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. బైలాస్‌లో బయటవాళ్లు పోటీ చేయకుండా మార్పు చేయవద్దు. ఎవరైనా పోటీ చేయవచ్చు అన్నదానికి విష్ణు ఒప్పుకుంటే  రాజీనామాను వెనక్కి తీసుకుంటా అని పేర్కొన్నారు. ఇక రాజీనామా చేసినా మా సభ్యల సంక్షేమం కోసం ప్రశ్నిస్తామని, ఓడిపోయాం అని మేం వదిలేయబోమని స్పష్టం చేశారు. చదవండి: అనసూయకు బిగ్‌ షాకిచ్చిన 'మా'

మరిన్ని వార్తలు